Header Banner

కమ్ముకుంటున్న భారత్- పాకిస్తాన్‌ మధ్య యుద్ధ మేఘాలు! టార్గెట్‌లో తెలుగు రాష్ట్రాలు!

  Wed May 07, 2025 19:58        India

భారత్- పాక్‌ వార్‌ ప్రకంపనల నేపథ్యంలో ఢిల్లీ వేదికగా కేంద్ర హోంశాఖ హైలెవల్‌ మీటింగ్‌ జరిగింది. ఈ సందర్భంగా.. దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను 3 కేటగిరీలుగా విభజించారు. మెట్రో, డిఫెన్స్‌, పోర్ట్స్‌, ఎనర్జీ హబ్స్‌ వారీగా డివిజన్‌ చేశారు. ఈ లెక్కన.. కేటగిరి-1లో దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రలోని తారాపూర్‌ న్యూక్లియర్ ప్లాంట్‌ను చేర్చారు. ఢిల్లీలో దాదాపు అన్ని విభాగాల ప్రధాన కార్యాలయాలు ఉండడంతో అదే పాకిస్తాన్‌కు మెయిన్ టార్గెట్‌గా భావించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, సూరత్, వడోదరతో పాటు.. అణు విద్యుత్ కేంద్రాలు ఉన్న పలు నగరాలు కేటగిరి-1లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన హైదరాబాద్, వైజాగ్‌లు కేటగిరి-2లో ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
ఒకవేళ యుద్ధమే ప్రారంభమైతే.. పాకిస్తాన్ ప్రధానంగా టార్గెట్ చేసే ప్రాంతాల్లో హైదరాబాద్‌, విశాఖ ఉండడంతో ఆయా ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అలెర్ట్‌ అవుతోంది. హైదరాబాద్‌లో రక్షణ పరిశోధన రంగాలకు చెందిన DRDO, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీ, అడ్వాన్స్‌డ్ హైపర్‌సోనిక్ విండ్ టన్నెల్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎయిర్ ఫోర్స్ అకాడమీ.. లాంటి అనేక రక్షణ రంగానికి చెందిన సంస్థలు ఉన్నాయి. ఇవి అగ్ని, పృథ్వీ, ఆకాశ్, బ్రహ్మోస్ వంటి క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఈ క్రమంలోనే.. కేటగిరీ-2 హిట్‌లిస్ట్‌లో హైదరాబాద్ ఒకటిగా చేరింది. మరోవైపు.. యుద్ధం వస్తే కేటగిరీ-2 హిట్‌లిస్టులో విశాఖపట్నం కూడా ఉండడం హాట్‌టాపిక్‌గా మారుతోంది. విశాఖలోనూ భారత రక్షణ రంగానికి చెందిన సంస్థలు ఉండడంతో కీలకంగా స్థానాన్ని సంపాదించింది. ప్రధానంగా.. విశాఖ తూర్పు నౌకా కమాండ్‌కు ప్రధాన కేంద్రంగా ఉంది. ఇది ఇండియన్‌ నేవీలో అతి ముఖ్యమైన కమాండ్‌లలో ఒకటిగా ఉంది. దీని ద్వారా తూర్పు తీరం, బంగాళాఖాతంలో సముద్ర రక్షణ కార్యకలాపాలు నిర్వహించబడతాయి. హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాబొరేటరీ, నావల్ డాక్‌యార్డ్, మేనేజ్‌మెంట్ అండ్ ఆర్మమెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ లాంటి కీలక సంస్థలు ఉన్నాయి. వీటితోపాటు విశాఖలో DRDO యుద్ధ విమానాలు, నౌకలు, హెలికాప్టర్ల కోసం పరికరాల తయారీ పరిశ్రమను స్థాపించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనిలోనే.. సైబర్ టెక్నాలజీ అభివృద్ధి చేసేందుకు కసరత్తు చేస్తోంది.


ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం! ఎప్పటి నుండి అంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #IndiaPakistanTensions #WarClouds #TeluguStatesAlert #BreakingNews #IndoPakConflict #NationalSecurity #DefenseUpdate